మునుగోడు, అక్టోబర్ 17 : గతంలో రైతులు పెట్టుబడికి అప్పులు చేసేవారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు బంధు అందించి అన్నదాతలకు ఆత్మబంధువుగా నిలిచారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కోతులారం గ్రామంలో పల్లా ఇంటింటి ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రచారంలో కోతులారం మాజీ సర్పంచ్ జక్కల లోకేశ్, జాజుల నర్సింహ, కందుల నర్సింహ, గుండు చెన్న కృష్ణయ్య, కందుల లింగస్వామి, బంగారు రవి, నర్సింహ, వెంకటేశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరికలు
పలివెల కాంగ్రెస్ వార్డు సభ్యులు చెరుకు సునీతా సైదులు, పంతంగి ధనమ్మ శ్రీను, చిలువేరు అంజమ్మ రాములు, సీనియర్ కార్యకర్తలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పూల వెంకటేశం, జిల్లా నాయకుడు దాడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్సీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
చండూరులో బీజేపీ నేతల చేరిక
చండూరు, అక్టోబర్ 17 : చండూరు మున్సిపాలిటీ 4వ వార్డులో బీజేపీ నుంచి ఇరవై మందికి పైగా యువకులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ఇరిగి రామకృష్ణ పాల్గొన్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే సమక్షంలో చేరికలు
చౌటుప్పల్, అక్టోబర్ 17 : చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామంలో పలు పార్టీలకు చెందిన వారిని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.