మునుగోడు, అక్టోబర్ 9 : దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని కోరటికల్లో నిర్వహించిన దళితుల ఆత్మీయల సమ్మేళనంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని 50 వేల మెజార్టీ తగ్గకుండా గెలిపించాలని కోరారు. నోట్లకట్టలకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డిని ఓడించి తగిన బుద్ది చెప్పాలన్నారు.
నూతన సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు, రైతు బీమా ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా మారాడన్నారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఖమ్మం సుడా చైర్మన్ విజయకుమార్, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, సర్పంచ్ వల్లూరి పద్మాలింగయ్య, ఎంపీటీసీ లక్ష్మమ్మ, ఉపసర్పంచ్ యాదగిరి, నాయకులు శేఖర్, అయితగోని లాలూబహుదూర్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిళ్ల వెంకట్‌రెడ్డి, సత్యం, దండు యాదయ్య, బొల్ల ప్రవీణ్, శ్రీశైలం, గురుపాదం పాల్గొన్నారు.