భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 24 : జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో బొడ్డెమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలాసత్పతి మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థినులతో బతుకమ్మ ఆట ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల కలబోత బతుకమ్మ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి, జిల్లా సంక్షేమ శాఖాధికారి కృష్ణవేణి, వ్యవసాయశాఖ అధికారి అనూరాధ, ఉద్యాన వన శాఖ అధికారి అన్నపూర్ణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీలక్ష్మి, పంచాయతీ అధికారి సునంద, వివిధ కార్యాలయాల మహిళా ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినులు, కిశోర బాలికలు, అంగన్వాడీ కార్యకర్తలు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, బాలల పరిరక్షణ విభాగం, సఖి సిబ్బంది పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్, : గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాలనే లక్ష్యంతో మోటార్ సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ర్టాలను 700రోజుల్లో పర్యటించాలనే తాతినేని రమేశ్‌బాబు లక్ష్యం ఎంతో ఉన్నతమైనదని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. దేశంలోని రాష్ర్టాల పర్యటనలో భాగంగా శనివారం జిల్లాకు వచ్చిన రమేశ్‌బాబును కలెక్టరేట్లో సన్మానించి అభినందించారు.
భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 24 : వయోవృద్ధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలాసత్పతి ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్, కరపత్రాలను శనివారం ఆవిష్కరించి మాట్లాడారు.
భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 25నుంచి అక్టోబర్ 3వరకు ప్రతిరోజూ బతుకమ్మ సంబురాలు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజూ నిర్వహించే బతుకమ్మ కార్యక్రమాలను అదనపు కలెక్టర్ డి,.శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షిస్తారని తెలిపారు.