డిస్కమ్‌లకు ‘సోలార్’ ఉచ్చు.. కరెంట్ ఇవ్వని ప్రాజెక్ట్‌లకూ చార్జీలు!
అంతర్రాష్ట్ర సోలార్ విద్యుత్తు కొనుగోళ్లు డిస్కమ్‌లకు గుదిబండగా మారుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్‌తో డిస్కమ్ మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర సోలార్ విద్యుత్తు కొనుగోళ్లు డిస్కమ్‌లకు గుదిబండగా మారుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్‌తో డిస్కమ్ మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘కరెంట్ వచ్చేదెప్పుడో.. కానీ భారం ఇప్పటి నుంచే’ అన్నట్టుగా ఉన్నదని, అంతిమంగా ఇది వినియోగదారులపై తీవ్రభారం మోపే ఒప్పందమని, దీనిని ఈఆర్సీ తిరస్కరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మూడు సంస్థల నుంచి 2,545 మెగావాట్ల సోలార్ విద్యుత్తును 25 ఏండ్ల కాలానికి కొనుగోలు చేసేందుకు డిస్కమ్‌లు రెడీ అయ్యాయి. ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఇటీవలే తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ)కి దరఖాస్తు చేశాయి.
మరోవైపు 2,545 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను ఆమోదించవద్దని విద్యుత్తురంగ నిపుణులు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాలరావు ఈఆర్సీని కోరారు. ఈ మేరకు లిఖితపూర్వక అభ్యంతరాలను ఈఆర్సీకి సమర్పించారు. ఈ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో ఆలస్యాలు, టారిఫ్ పెంపులు, ట్రాన్స్మిషన్ చార్జీలు, ట్రేడింగ్ మార్జిన్, సరఫరా లోపాలు వంటి సమస్యలొస్తాయని ఆయన అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఇది డిస్కమ్‌లకే కాకుండా విద్యుత్తు వినియోగదారులపై దీర్ఘకాలిక ఆర్థిక భారంగా మారే ప్రమాదమున్నదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాలను యథాతథంగా ఆమోదించకుండా, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేలా నిబంధనలు సవరించాలని ఆయన కోరారు.
ట్రేడింగ్ మార్జిన్‌తో రూ.741 కోట్ల మోత
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) నుంచి 1,045, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) నుంచి 500, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెకి) నుంచి 1,000 మెగావాట్లు కలిపి మొత్తం 2,545 మెగావాట్లను 25 ఏండ్ల కాలానికి కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. అయితే 2025 నవంబర్ 10 నాటికి 1,288.3 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు మాత్రమే కమిషన్ అయ్యాయి. మరో 1,256.7 మెగావాట్లు ఇంకా కమిషన్ కావాల్సి ఉన్నది. అంతేకాకుండా కమిషన్ అయిన ప్లాంట్ల నుంచి కూడా డిసమ్లకు విద్యుత్తు సరఫరా ప్రారంభం కాలేదని కనుక ఇందుకు అనుమతినివ్వవద్దని వేణుగోపాలరావు ఈఆర్సీని కోరారు. మధ్యవర్తి సంస్థలకు యూనిట్‌కు 7 పైసల ట్రేడింగ్ మార్జిన్ చెల్లించే నిబంధనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2,545 మెగావాట్ల సౌర విద్యుత్తును 25 ఏండ్లపాటు కొనుగోలు చేస్తే డిసమ్లు సుమారు రూ.741.25 కోట్లు ట్రేడింగ్ మార్జిన్ రూపంలో చెల్లించాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. పక్క రాష్ట్రం ట్రేడింగ్ మార్జిన్ వేరుగా ఉన్నదని, దీనిని యూనిట్‌కు 7 పైసలు కాకుండా కెపాసిటీ చార్జీలపై 0.5 శాతంగా పరిమితం చేయాలని కోరారు.
అభ్యంతరాలివే..
- ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, సెకి సంస్థలతో వేర్వేరు పథకాల కింద కుదిరిన ఒప్పందాలను టీజీ ఈఆర్సీ ఒకే పిటిషన్‌గా విచారించరాదు. విడివిడిగా పరిశీలించాలి.
- జనరల్ నెట్వర్క్ యాక్సెస్ నిబంధనల అమలుతో అంతర్రాష్ట్ర విద్యుత్తు సరఫరా(ఐఎస్టీఎస్) చార్జీల్లో తేడాలు ఉత్పన్నమయ్యాయి. 2024 డిసెంబర్ నుంచి 2025 మే వరకు ఐఎస్టీఎస్ చార్జీలు యూనిట్‌కు 39 నుంచి 59 పైసల మధ్య ఉన్నట్టు డిసమ్లు పిటిషన్లో పేర్కొన్నాయి. దీంతో ఒప్పందాల్లో పేర్కొన్న సౌర విద్యుత్తు టారిఫ్కంటే వాస్తవ వ్యయం గణనీయంగా పెరిగే ప్రమాదమున్నది.
- ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, సెకి వంటి మధ్యవర్తి సంస్థలు ప్రధానంగా పరిపాలన, సమన్వయపాత్ర మాత్రమే పోషిస్తున్నాయి. అయినా సదరు సంస్థలకు ఇంత భారీ మార్జిన్ ఎందుకు చెల్లించాలి?
- జీఎస్టీ రేటు 5 నుంచి 12 శాతానికి పెరిగినట్టు పేరొన్నారు. అయితే ఏ డెవలపర్ ఎంత జీఎస్టీ చెల్లించాడు? ఏ కాలానికి ఎంత భారం పడింది? అన్న వివరాలను డిసమ్లు పూర్తిగా పరిశీలించాయా అన్నది స్పష్టం చేయాలి.
- ఒప్పందం ప్రకారం సౌరవిద్యుత్తు అందకపోతే డిసమ్లు తమ అవసరాలకు మారెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఒకవైపు ఒప్పందం ప్రకారం సౌరవిద్యుత్తు సరఫరా జరుగకపోవడం, మరోవైపు మారెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాల్సి రావడంతో వినియోగదారులపై రెండు రకాలుగా భారం పడే అవకాశమున్నది.
- ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్ నెట్వర్ ఆలస్యాలకు ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టం చేయాలి. సౌర విద్యుత్తు ప్లాంట్లు సిద్ధమైనా విద్యుత్తును సరఫరా చేసే నెట్వర్ సిద్ధంగా లేకపోతే అధిక నష్టమేర్పడుతుంది.
- డెవలపర్లు ఒప్పంద బాధ్యతలు నెరవేర్చకపోయినా ఆర్థిక నష్టం డిసమ్పైనే పడుతుంది. మధ్యవర్తి సంస్థలు బాధ్యత వహించకుండా మార్జిన్‌ను పొందాలని చూడటం సహజ సూత్రాలకు విరుద్ధం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

