చండూరు, సెప్టెంబర్ 20 : చండూరు మండల టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వన భోజన కార్యక్రమాన్ని మున్సిపల్ పరిధిలోని బంగారిగడ్డ రోడ్డులో బుధవారం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. మంగళవారం ఆయన డీఎస్పీ నర్సింహారెడ్డితో కలిసి కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఉదయం 11గంటలకు ప్రారంభంకానున్న సమావేశానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, పేరిని నృత్యాలు, జానపద గేయాలు, ఆటపాటలతో పాటు 13రకాల రుచికరమైన వంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, సర్పంచ్ పల్లె వెంకటయ్య, బూతరాజు ధశరథ, సుంకరి సత్తయ్య, పాశం వెంకట్‌రెడ్డి ఉన్నారు.