దేవరకొండ, సెప్టెంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల వారు టీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. డిండి మండలం కందుకూరు గ్రామానికి చెందిన 60 కుటుంబాలు సోమవారం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో టీఆర్ఎస్ అగ్రస్థానంలో ఉందన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో పట్టణాలు, పల్లెల రూపురేఖలు మారాయన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్రావు, సిరందాసు కృష్ణయ్య, పార్టీ యువజన విభాగం మండలాధ్యక్షుడు మల్రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, నేనావత్రాంబాబు, సంజీవ, అంజల్‌రావు, సూరి, రాజు, బొడ్డుపల్లి కృష్ణ, విష్ణు, వడిత్యాబాలు పాల్గొన్నారు.