చౌటుప్పల్, సెప్టెంబర్ 19 : టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం(వనభోజనం) మున్సిపాలిటీ కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా వలిగొండ రోడ్డు పక్కన మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్న సమ్మేళనానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, జానపద గేయాలు, ఆట, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మనందరం కుటుంబాలతో సహా కలుసుకునేందుకే ఈ వేదికను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులఫోరం మండలాధ్యక్షుడు మునగాల ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.
చండూరులో స్థల పరిశీలన
చండూరు : ఈ నెల 21న చండూరు మండల టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమం కోసం స్థలాన్ని సోమవారం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డ రోడ్డులో ఉన్న పంపుహౌజ్ ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నామని, కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, కౌన్సిలర్ కోడి వెంకన్న, సర్పంచ్ పల్లె వెంకటయ్య, బొడ్డు సతీశ్ ఉన్నారు.