తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అంబరాన్నంటాయి. మూడు రోజుల వేడుకల్లో తొలిరోజు శుక్రవారం జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా సాగాయి. వివిధ గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, విద్యార్థులు తదితరులు భారీగా తరలివచ్చారు. మువ్వన్నెల జెండా చేతబూని
సమైక్యతా స్ఫూర్తిని చాటారు. వేలమందితో రహదారులన్నీ కోలాహలంగా మారాయి. ఈ సందర్భంగా జాతీయ భావాన్నితెలిపేవిధంగా కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. మండల కేంద్రాల్లోనూ ర్యాలీలు తీసి జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. జై తెలంగాణ,
జై భారత్, జై హింద్ నినాదాలో హోరెత్తించారు.