సీఎం కేసీఆర్ రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయం చారిత్రాత్మకమని, సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు.
హాలియా : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆయన పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటి చెప్పారన్నారు. అదేవిధంగా ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టి తమ చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. ఈ దిశగా రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యక్రమంలో హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, గుర్రంపోడు ఎంపీపీ మంచుకంటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు చేరుపల్లి ముత్యాలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యడవల్లి నీలిమామహేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎన్నమల్ల సత్యం, సురభి రాంబాబు, పిడిగం నాగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మర్రిగూడ : మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్, దళితబంధు జిల్లా కమిటీ మెంబర్ లపంగి నర్సింహ, సర్పంచ్ నల్ల యాదయ్య, కోఆప్షన్ సభ్యుడు ఎండీ.యూకూబ్, మండల ఉపాధ్యక్షుడు మారగోని వెంకటయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు రాపోలు యాదగిరి, మాజీ సర్పంచులు ఎడ్ల శ్రీరాములు, అంజయ్య, నాయకులు కొల్కులపల్లి యాదయ్య, పందుల కృష్ణగౌడ్, పగడాల యాదయ్య, వల్లంల సంతోశ్‌యాదవ్, గ్యార నగేశ్, ఎల్.భిక్షం, యాచారం రమేశ్, కొంపెల్లి నాగరాజు, లక్ష్మణ్‌నాయక్, ముత్తయ్య పాల్గొన్నారు.
మునుగోడు : మండలంలోని కొరటికల్‌లో టీఆర్ఎస్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి కూర్పటి గణేశ్, వార్డు సభ్యురాలు జయమ్మ ఆధ్వర్యంలో నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గ్రామశాఖ ఉపాధ్యక్షుడు సిర్గమల్ల అంజయ్య, నాయకులు దండు మహేశ్, దండు సోములు, రొమ్ముల సైదులు, దండు వెంకటరమణ, దండు శ్రీను, కూర్పటి వెంకన్న, తలారీ సహదేవులు, దండు వెంకులు, కూర్పటి ప్రభాకర్, నర్సింహ పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : మండలంలోని చిమిర్యాలలో దళిత సంఘాల అధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, ఎంపీటీసీ కలకొండ సౌజన్య, సర్పంచులు శెట్టి సురేశ్‌నాయుడు, పాముల మస్తాన్, మాజీ సర్పంచ్ గడిపూడి శ్రీకాంత్, గ్రామశాఖ అధ్యక్షుడు పెంట్యాల విష్ణువర్దన్‌రావు, ప్రధాన కార్యదర్శి అప్పారావు, ఎస్సీ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కలకొండ బాలకృష్ణ నాయకులు ధరావత్ బాబ్జి, కంచుగంటి గోపి, అంబడిపూడి రవి పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, అంబేద్కర్ చిత్రపటాలకు టీ ఎమ్మార్పీస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం నియోజవర్గ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు కందుల శ్రీను, పి.ఏసు, ఎలమర్తి ఉపేందర్, పోపలంపల్లి శ్రీను, కందుల విజయ్, చింతా విజయ్, వేణు పాల్గొన్నారు.
నాంపల్లి : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, మాల్ మార్కెట్ డైరెక్టర్ కడారి శ్రీశైలంయాదవ్, నాయకులు నడింపల్లి యాదయ్య, బెక్కం రమేశ్, అన్నెపాక కిరణ్, సప్పిడి శ్రీనివాస్, అందుగుల యాదయ్య, సపావత్ సర్దార్‌నాయక్, మేకల దేవేందర్, బుషిపాక నగేశ్ పాల్గొన్నారు.
హాలియా : పట్టణంలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు ఎన్నమల్ల సత్యం, చేరుపల్లి ముత్యాలు, పిడగం నాగయ్య, బుర్రి మొగలయ్య, బందిలి సైదులు, పోతుగంటి తిరుమల్, దుండిగల్ల శ్రీనివాస్, జానకిరాములు, లక్ష్మయ్య, తుడుం ముత్తయ్య, శ్రీనునాయక్, హరికృష్ణ పాల్గొన్నారు.
మద్దిరాల : మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ.రజాక్ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు దుగ్యాల రవీందర్రావు, మల్లు కపోతంరెడ్డి, గుడ్ల వెంకన్న, కుందూరు విష్ణువర్దన్‌రెడ్డి, కన్న వీరన్న, సూరినేని నర్సింహారావు, జిలకర చంద్రమౌళి, పాతూరి లింగారెడ్డి, వడ్డానం మధుసూదన్, మల్లు కలింగారెడ్డి, యువజన మండల నాయకులు వల్లపు రమేష్, మల్లు ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సచివాలయానికి అంబేద్కర్ పేరు హర్షణీయం:ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
చండూరు : తెలంగాణ నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి సైతం అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణాధ్యక్షుడు బూతరాజు దశరథ, నాయకులు కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్, కొన్రెడ్డి యాదయ్య, బీయనపల్లి శేఖర్, పున్న ధర్మేందర్ పాల్గొన్నారు.