రామన్నపేట, సెప్టెంబర్ 11: ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో దళితులు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో 38 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం రూ. 20లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, రూ. 5 లక్షలతో యాదవసంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతన పింఛను కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తరహా సంక్షేమపాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
ప్రజలంతా కేసీఆర్‌కు అండగా నిలబడాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. దళితబంధు పథకంతో దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి టీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అన్నివర్గాలకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను దళితబంధు లబ్ధిదారులు ఘ నంగా సన్మానించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కార్యకర్తలకు సూచించారు. ఆదివారం మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన సీపీఎం కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత, కొత్త తేడాలు లేకుండా పార్టీ పటిష్టతకు కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు.
కార్యక్రమాల్లో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, ఎంపీటీసీ పుష్పావెంకట్రెడ్డి, పీఆర్ఏఈ గాలయ్య, పశువైద్యాధికారి శాంతిబాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బొక్క యాదిరెడ్డి ఎడ్ల మహేందర్‌రెడ్డి, అప్పం లక్ష్మీనర్సు,ఎం.మహేందర్‌రెడ్డి, రేఖయాదయ్య, సంధ్యాస్వామి, పారిజాత, ఆమేర్, సోమ య్య, నాయకులు రమేశ్, మాధవరెడ్డి, మల్లేశం, సాయి, రమేశ్, జయచందర్‌రెడ్డి, కార్యదర్శి లావణ్య, టీఆర్ఎస్ సిరిపురం గ్రామశాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, బీసీసెల్ మండలాధ్యక్షుడు ముత్తయ్య, కృష్ణ, నర్సిరెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.