యాదగిరిగుట్ట రూరల్, సెప్టెంబర్ 11 : కొత్త ఆసరా పింఛన్ల కోసం వేచిచూసిన లబ్ధిదారుల ఆశలు ఫలించాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన వారికి కొత్తగా ఆసరా పింఛన్లను మంజూరు చేసింది. అర్హత వయస్సును తగ్గించి లబ్ధిదారులను ఎంపిక చేసింది. దాంతో యాదగిరిగుట్ట మండలంలో కొత్తగా 956 మందికి పింఛన్లు మంజూరయ్యాయి.
మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో గతంలో 4,766 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. కొత్తగా 956 మందితో కలిపి మొత్తం 5,722 మందికి పింఛన్లు అందనున్నాయి.
బాహుపేటలో 71 మందికి, చిన్నగౌరాయపల్లి 18, చిన్నకందుకూరు 74, చొల్లేరు 41, దాతరుపల్లి 53, ధర్మారెడ్డిగూడెం 35, గౌరాయపల్లి 84, జంగంపల్లి 19, కాచారం 54, కంఠంగూడెం 17, లప్పానాయక్తండా 5, మహబూబ్పేట 21, మైలార్గూడెం 30, మల్లాపురం 80, మర్రిగూడెం 21, మాసాయిపేట 73, పెద్దకందుకూరు 27, రాళ్లజనగాం 24, రామాజీపేట 27, సాధువెళ్లి 52, సైదాపురం 42, తాళ్లగూడెం 18, వంగపల్లిలో 70 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి.
57 ఏండ్లకే పింఛన్ తీసుకోవడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ సారు మా లాంటి వాళ్ల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. ఈ ఆసరా పింఛన్ నాకు ఎంతో ఉపయోగపడనున్నది. మాకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
-అలీమొద్దీన్, లబ్ధిదారుడు, మల్లాపురం
ఆసరా పింఛన్ ఎంతో మందికి భరోసా ఇస్తున్నది. వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. దేశంలోనే గొప్ప నాయకుడైన సీఎం కేసీఆర్కు అందరూ అండగా నిలువాలి.
-కర్రె వెంకటయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు