తుర్కపల్లి, సెప్టెంబర్11 : ప్రజలంతా భక్తిభావం కలిగి ఉండాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీతోపాటు దేవోజీనాయక్తండాలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఆదివారం ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా గొల్లగూడెంలో నల్లపోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, యువజన విభాగం నాయకుడు గట్టు తేజస్వీ నిఖిల్, సుంకరి శట్టయ్య పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండలంలోని పారుపల్లిలో శనివారం రాత్రి గణేశ్ నిమజ్జనంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. మండల కేంద్రంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం భక్తులు పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు లగ్గాని రమేశ్‌గౌడ్, జన్నాయికోడె నగేశ్, ఎంపీటీసీ కవిత పాల్గొన్నారు.