నందికొండ, సెప్టెంబర్ 11 : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో కాస్త తగ్గింది. ఆదివారం 2,15,145 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా క్రస్ట్ గేట్లను 22 నుంచి 10కి తగ్గించారు. సాగర్ రియర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312 టీఎంసీ) కాగా ప్రస్తుతం 587.80 అడుగులు(305.9818 టీఎంసీ)గా ఉంది. రిజర్వాయర్ నుంచి 10 క్రస్ట్ గేట్ల ద్వారా 1,45,760 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 9,160, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 25,882, వరద కాల్వ ద్వారా 400, మొత్తం 1,81,202 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నది.
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులు (211.4754 టీఎంసీ) ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 2,46,576 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. రిజర్వాయర్‌కు ఆదివారం 8,995.98 క్యూసెక్కుల వరద రాగా ప్రాజెక్టు నుంచి 9,285 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్ల ద్వారా 8,571.68, కుడి కాల్వకు 276.29, ఎడమ కాల్వకు 189.47 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 47.56 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, 200 క్యూసెక్కులు సీపేజ్ రూపంలో పోతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 642.40 అడుగులు(3.79 టీఎంసీలు)గా ఉంది.