మర్రిగూడ, సెప్టెంబర్ 11 : మునుగోడు నియోజకవర్గంలో గుబాళించేది గులాబీ జెండాయేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మర్రిగూడ మండలం కొండూరు గ్రామ ఉప సర్పంచ్ జంగయ్యగౌడ్తోపాటు ముగ్గురు వార్డు సభ్యులు శనివారం వారి అనుచరులతో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్లోకి రోజురోజుకూ పెరుగుతున్న వలసలు సీఎం కేసీఆర్ నాయకత్వం మీద పెరిగిన విశ్వసనీయతకు అద్దం పడుతున్నాయన్నారు.
మునుగోడులో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మర్రిగూడ మండలంలోని కొండూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ పాలకూర్ల జంగయ్య, ముగ్గురు వార్డు సభ్యులు ఎండీ జహంగీర్, పగడాల రాములు, ఆంబోతు రాజేందర్, సీనియర్ నాయకుడు ఊడుగు శ్రీనుగౌడ్ సహా వారి అనుచరులు శనివారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరముందన్నారు. కేసీఆర్‌పై విశ్వసనీయతతో రోజురోజుకూ టీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయన్నారు. కమలం పార్టీకి రాష్ట్రంలో చోటు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదని, గల్లీలో రాదని పేర్కొన్నారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డిని కొండూరు టీఆర్ఎస్ నేతలు శాలువాలతో సత్కరించారు. మర్రిగూడ ఇన్చార్జి ఏడుపుల గోవింద్, సర్పంచ్ కుంభం నర్సమ్మామాధవరెడ్డి, మాజీ సర్పంచ్ ఊడుగు అంజనమ్మాఅంజయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు వల్లపు సైదులుయాదవ్, టీఆర్ఎస్ నాయకుడు బండి యాదయ్య, దేవేందర్, లాలు పాల్గొన్నారు.
లక్కారంలో 200 మంది చేరిక..
చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో కాంగ్రెస్, టీడీపీకి చెందిన సుమారు 200 మంది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ ఎర్ర భుజంగం, ఎర్ర లింగస్వామి, గోపనబోయిన శివ, ఎర్ర గాలయ్య, గ్యార మారయ్య, నర్సింహ, రాములు, యాదయ్య, శంకరయ్య, బాలయ్య, మహేశ్, గాలయ్య, జంగయ్య, నర్సింహ, మహిళలు ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండబోయి వెంకటేశ్‌యాదవ్, మాజీ సర్పంచులు కానుగు బాలరాజు, పాశం సంజయ్‌బాబు, చుక్క యాదయ్య, సుర్కంటి నవీన్‌రెడ్డి, అంజయ్య, ఊదరి వెంకటేశం పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని నామాపురంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 కుటుంబాలు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటేశ్, ఉపాధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్, వార్డు సభ్యులు చిన్నమారయ్య, గాలయ్య, యూత్ అధ్యక్షుడు శంకర్, నాయకులు నర్సింహ, రాజేందర్, రాములు, జంగయ్య, లింగయ్య, అంజయ్య, లచ్చయ్య పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సంస్థాన్ నారాయణపురం : సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండంల కేంద్రంలోని గుండ్లమెట్ల కాలనీకి చెందిన 60మంది, పుట్టపాకకు చెందిన 30 మంది వివిధ పార్టీల కార్యకర్తలు శనివారం కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, పీఏసీఏస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు లారీ భిక్షం, నాయకులు గాలయ్య, భిక్షం, శేఖర్ పాల్గొన్నారు.