మిర్యాలగూడ, సెప్టెంబర్ 8 : బస్తీ దవాఖానల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. బస్తీ దవాఖానల ఏర్పాటుతో అస్వస్తతకు గురైన వెంటనే చికిత్స అందుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, డీఎంహెచ్ఓ కొండల్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ కేసా రవి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, చిట్టిబాబునాయక్, అన్నభీమోజు నాగార్జునాచారి, మోషీన్అలీ, తిరునగరు నాగలక్ష్మి, ఉబ్బపల్లి వెంకమ్మ, నవాబ్, ఇలియాస్, రామక్రిష్ణ, ఎండీ.షోయబ్, మధు, అయోధ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.