గుర్రంపోడు, సెప్టెంబర్ 8 : నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో 22 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.6లక్షల 28వేల చెక్కులను గురువారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గాలి సరితా రవికుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్‌రెడ్డి, సర్పంచ్ షేక్ మస్రత్సయ్యద్మియా, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రావులపాటి భాస్కర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బల్గూరి నగేశ్‌గౌడ్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గుండెబోయిన కిరణ్ పాల్గొన్నారు.
తిరుమలగిరి సాగర్ : మండలంలోని ఎర్రచెర్వుతండాకు చెందిన రమావత్ లక్ష్మణ్‌నాయక్ సీఎం సహాయనధి నుంచి మంజూరైన రూ.31వేల చెక్కును గురువారం ఎంసీ కోటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.