కోదాడటౌన్, సెప్టెంబర్ 8: జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో కోదాడ పట్టణంలోని నయానగర్‌కు చెందిన విద్యార్థిని చందాల యశస్వీని శ్రీ ప్రతిభ కనబరిచారు. ఓపెన్ క్యాటగిరీలో 52వ ర్యాంకు, ఓబీసీ క్యాటగిరీలో జాతీ య స్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. యశస్విని శ్రీ 1 నుంచి 5వరకు సైదయ్య కాన్సెప్ట్ స్కూల్లో, 6 నుంచి 10 వరకు కోదాడలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్య నభ్యసించింది. యశస్విని తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి సోమయ్య కోదాడ మున్సిపాల్టీలో సీనియర్ అసిస్టెంట్‌గా, తల్లి శశిరేఖ కోదాడ పట్టణంలోని ఆజాద్‌నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. తమ కూతురుకు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యశస్విని శ్రీ మాట్లాడుతూ అమ్మ,నాన్నల కృషి, అధ్యాపకుల ప్రోత్సాహం ర్యాంకు సాధించినట్లు తెలి పారు. రోజుకు 12 గంటలు ప్రణాళికాయుతంగా చదవడంతో విజయం సాధించినట్లు వివరించారు.
సిలార్మియాగూడెం వాసికి 336వ ర్యాంకు
తిప్పర్తి : మండలంలోని సిలార్మియాగూడెం సర్పంచ్ ఎర్రమాద కవితానరేందర్రెడ్డి కుమారుడు మనోప్రీత్రెడ్డికి నీట్లో ఆల్‌ఇండియాలో 336వ ర్యాంకు సాధించాడు. మనోప్రీత్రెడ్డికి ఆల్ఇండియా ర్యాంకు రావడం పట్ల గ్రామస్తులు అభినందించారు.
నకిరేకల్ : మణిసంజనతో తల్లిదండ్రులు శ్రీనివాస్,రమ్య
నకిరేకల్ విద్యార్థినికి 2,065 ర్యాంకు
నకిరేకల్ : నీట్ ఫలితాల్లో నకిరేకల్ విద్యార్థిని మణిసంజన ఆల్ ఇండియా స్థాయిలో 2,065 ర్యాంకు సాధించింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు పున్న శ్రీనివాస్, రమ్య కుమార్తె. ఓబీసీ కేటగిరీలో 600 ర్యాంకు సాధించింది. మణిసంజన 1నుంచి 4వ తరగతి వరకు నకిరేకల్ సెయింట్ ఆన్స్ స్కూల్, 5,6 తరగతులు ఎస్పీఆర్ స్కూల్, 7 నుంచి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్ నారాయణ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించింది. సంజన ర్యాంకు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మణిసంజన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి డాక్టర్ కావాలన్న లక్ష్యంతో చదివాను. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించాను. గైనకాలజిస్ట్‌గా సేవ చేయాలనేదే ఆశయం.
కేఎల్ఎన్ విద్యార్థినులకు ఉత్తమ ర్యాంకులు
మిర్యాలగూడ : పట్టణంలోని కేఎల్ఎన్ కళాశాల విద్యార్థులు నీట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ కిరణ్‌కుమార్ తెలిపారు. కళాశాల విద్యార్థినులు కే.దీప్తి 550 మార్కులు, బీ.శాంత 439 మార్కులు సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ అధ్యాపకుల ఉత్తమ బోధన వల్ల ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థినులను కరస్పాండెంట్ కిరణ్‌కుమార్, డైరెక్టర్లు పీఎల్ఎన్ రెడ్డి, నరేందర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, చైతన్య అభినం దించారు.
మెరిసిన జాస్రీత అకాడమీ విద్యార్థులు
రామగిరి: నల్లగొండలోని జాస్రీత అకాడమీ విద్యార్థులు లాంగ్‌టర్మ్ శిక్షణ తీసుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సభాహత్ హబీబ్ 550 మార్కులు, అజీబా అజ్మి 511 మార్కులు సాధించారని ఆ సంస్థ్ధ నిర్వాహకులు ఆదిరెడ్డి, శ్రీధర్ రెడ్డి తెలిపారు. విద్యార్థ్ధులను వారు అభినందించారు.