చండూరు, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రజలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. చండూరులో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మండలంలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఉప సర్పంచ్ జక్కలి ముత్తయ్య మరో 10మందితో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, అవ్వారు శ్రీనివాస్, బొడ్డు సతీశ్, ఉజ్జిని అనిల్‌రావ్, పెండ్యాల గీత పాల్గొన్నారు.
చండూరు(గట్టుప్పల్) / మర్రిగూడ : మునుగోడు నియోజకవర్గంలో వలసల పర్వం ఊపందుకుంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమక్షంలో పలువురు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. చండూరు మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో గట్టుప్పల్ మండలంలోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన 65మంది, మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన 100మంది కాంగ్రె స్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మి ఓట్లేసిన మునుగోడు ప్రజలను మోసం చేసి బీజేపీకి అమ్ముడుబోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
పార్టీలో చేరిన వారిలో గడ్డం హన్మంతు, చిలువేరు సాంబయ్య, ఎర్రమాద శ్రీనివాస్, పెద్దగోని నారాయణ, గుత్తి భాస్కర్, పున్న శంకర్, అంద్రిక అశోక్, వల్లకాటి నరేశ్, మాడుగుల మారయ్య, శిలివేరు దేవేందర్, పున్న గణేశ్, ముశం శ్రీను, బొడిగ నవీన్, మాక నిత్యానంద్‌తో పాటు మరో 50 మంది ఉన్నారు.
చండూరు మం డలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన బూతరాజు జంగయ్య, నర్సింహ, బంగారు శ్రీను టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఐతగోని వెంకటయ్యగౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు వరికుప్పల వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ ఏర్పుల అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అవ్వారు శ్రీను, నాయకులలు బండారు చంద్రయ్య, నామని గోపాల్, ఇడెం కైలాసం, చెరుపల్లి భాస్కర్, ఆంజనేయులు, కర్నాటి అబ్బయ్య, భీమగాని యాద య్య, జూలూరి పురుషోత్తం, పున్న కిశోర్, శిలువేరు అయోధ్య తదితరులు పాల్గొన్నారు.