నాంపల్లి, సెప్టెంబర్ 6 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి తగిన బలం లేకపోవడంతో వివిధ పార్టీల నుంచి తమ పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టిపెట్టింది. అందులోనూ.. పార్టీలో చేరిన వారినే మళ్లీ చేర్చుకుంటూ బలం పెరుగుతుందని ప్రజలకు కలరింగ్ ఇస్తున్నది. ఈ క్రమంలో నాంపల్లి మండలం చిట్టెంపహాడ్ గ్రామ సర్పంచ్ అబ్బనబోయిన చంద్రమౌళి ఆగస్టు 24న హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తాజాగా మంగళవారం చిట్టెంపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సమక్షంలోనే మళ్లీ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఒకే వ్యక్తి రెండు సార్లు పార్టీలో చేరడం.. అదికూడా రాజగోపాల్రెడ్డి సమక్షంలోనే జరుగడంతో ప్రజలు నవ్వుకుంటున్నారు.