నందికొండ, సెప్టెంబర్ 5 : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు సోమవారం ఎగువ ప్రాంతాల నుంచి 1,74,449 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. దాంతో ఎన్నెస్పీ అధికారులు ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్లను ఎత్తి 1,28, 096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590(312 టీఎంసీ) అడుగులు కాగా ప్రస్తుతం 589.10(309.3558 టీఎంసీ) అడుగులు ఉంది. రిజర్వాయర్ నుంచి కుడికాల్వకు 10,120 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,634, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 32,399, ఎస్ఎల్బీసీకి 1800, వరద కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నా గార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి మొత్తం 1,79,449 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది.
శ్రీశైలం సమాచారం
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 (214.8450టీఎంసీ) అడుగుల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 1,18,630 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.
మూసీకి 1182 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,182.72 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా ప్రాజెక్టు నుంచి 1,182.72 క్యూసెక్కులను బయటికి విడుదల చేస్తున్నారు. అధికారులు ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును ఎత్తి 313.75 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా సోమవారం సాయంత్రం వరకు 642.50 అడుగులు (3.82 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ ఉదయ్‌కుమార్ తెలిపారు.