చండూరు, ఆగస్టు 30 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై యువత టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నెర్మట గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రతి ఫలాలను అనుభవిస్తున్నవారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధమై పార్టీలోకి పెద్ద ఎత్తున వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం యువతకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, గ్రామశాఖ అధ్యక్షుడు నారపాక శంకరయ్య, ఈరటి శ్రీశైలం, నర్సింహ, బోయపల్లి వేణు, వరికుప్పల సురేశ్ పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని దామెరభీమనపల్లిలోని 20 కుటుంబాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఎంపీటీసీ శిలువేరు విష్ణు, గ్రామశాఖ అధ్యక్షుడు నడిమింటి శ్రీను ఆధ్వర్యంలో కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డితో కలిసి ప్రభాకర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మల్గిరెడ్డి కృష్ణారెడ్డి, మునగాల నాగిరెడ్డి, వెంకట్‌రెడ్డి, కర్నాటి శివగౌడ్, శిలువేరు యాదయ్య, రమేశ్, నడిమింటి శ్రీకాంత్, భిక్షం, హరిప్రసాద్, నవీన్ పాల్గొన్నారు.
నాంపల్లి : మండలంలోని పెద్ద్దాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు కన్నెబోయిన శంకర్, కన్నెబోయిన బాలగిరి, పోనాల శ్రావణ్, ఎడ్ల శివ కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఇమడలేక తిరిగి మంగళవారం చౌటుప్పల్‌లోని కొయ్యలగూడెంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మేళ్లవాయి ఎంపీటీసీ బత్తుల వంశి, జెల్లల సైదులు, నాగరాజు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని డి.నాగారం గ్రామానికి చెందిన 50 కుటుంబాలకు చెందిన 150 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్‌లోని కూసుకుంట్ల నివాసంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ప్రభాకర్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్‌రెడ్డ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, మండల అధికార ప్రతినిధి సుర్కంటి శ్రీధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ కొండ హారిక, అభినందన్‌రెడ్డి, పాక రాము, దోనూరి జనార్దన్‌రెడ్డి, లక్ష్మణ్, మల్కాపురం లింగస్వామి, షేక్ జహంగీర్, నర్సింహ, షేక్ జమాల్ పాల్గొన్నారు.