భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 29 : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. మండలానికి 100 మట్టి విగ్రహాల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ అధికారి యాదయ్య తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఏఓ అనురాధ, ఉద్యాన వనశాఖ జిల్లా అధికారి అన్నపూర్ణ పాల్గొన్నారు.
బీబీనగర్, ఆగస్టు 29 : మండల కేంద్రంలో టైగర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను పంపిణీ చేశారు. సుమారు 500 విగ్రహాలను పంపిణీ చేసిన ట్రస్ట్ అధ్యక్షుడు పంజాల సురేశ్‌గౌడ్‌ను అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు బెండె ప్రవీణ్, టంటం రఘు, ట్రస్ట్ సభ్యులు సదానంద్‌గౌడ్, ముకేశ్, సురేశ్, భాగ్యమ్మ, పంజాల ప్రవీణ్‌గౌడ్, లాలయ్య, సురేశ్, రాకేశ్, నరేశ్ పాల్గొన్నారు.