సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 29 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గంగమూలతండా, కడిలబావితండా గ్రామానికి చెందిన 80 మంది కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని అన్నా రు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేశ్ పాల్గొన్నారు.
మర్రిగూడ :మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అదే విధంగా ఖుదాభక్ష్‌పల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గులా బీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కూసుకుంట్ల మాట్లాడుతూ మునుగోడు ప్రజలు కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంభం నర్సమ్మామాధవరెడ్డి, మాజీ సర్పంచులు ఊడుగు అంజయ్య, వల్లపు పర్వతాలు, గ్రామశాఖ అధ్యక్షుడు వల్లపు సైదులు యా దవ్, నాయకులు మట్టిపెల్లి నర్సింహ, ఊడుగు నర్సింహ, దండుగుల కృష్ణ, బండి యా ద య్య, గూడూరు జంగయ్య, సాలార్జంగ్,వల్లపు రాములు, కొండలు, శ్రీశైలం పాల్గొన్నారు.