నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రేగట్టె మల్లికార్జున్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యమ నేతగా, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా సేవలందిస్తున్న ఆయనకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. రెండేండ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
రామగిరి, ఆగస్టు 27: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రేగట్టె మల్లికార్జున్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ విడుదల చేశారు. రెండేండ్ల పాటు రేగట్టె ఈ పదవీలో కొనసాగనున్నారు. సోమవారం జిల్లా గ్రంథాలయ సంస్థ 13వ సారథిగా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21, 2017 నుంచి ఇప్పటి వరకు జిల్లా కేంద్రానికి చెందిన రేకల భద్రాద్రి ఈ హోదాలో పనిచేసి గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేశారు. మల్లికార్జున్రెడ్డి గతంలో చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వస్వామి ఆలయ చైర్మన్గా, నార్కట్పల్లి ఎంపీపీగా పనిచేశారు.