వినాయక చవితి పండుగను భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపు కోవాలి. అందుకు భక్తమండళ్లు కొన్ని నియమాలు పాటించాలి. ఈ నెల 31న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలపై అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలి. విగ్రహాలు నెలకొల్పే కమిటీలు ముందుస్తుగా స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకొని విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షించాలి. ఏమైనా సంఘటనలు జరిగితే కమిటీ సభ్యులదే పూర్తి బాధ్యత. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
-రామలింగారెడ్డి, సీఐ, హుజూర్నగర్