మునుగోడు, ఆగస్టు 27 : నమ్మిన పార్టీని, ప్రజలను మోసం చేసే చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బండి కింద పోయే కుక్కల మాదిరిగా కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలు మారాయని, ఆ బండిని మోసేది తామే అనే భ్రమలు కల్పించడంలో వారిది అందె వేసిన చెయ్యి అని విమర్శించారు. అమిత్‌షా సభకు జనాలను పంపింది వెంకట్రెడ్డేనని ఆరోపించారు. రానున్న మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని, బీజేపీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని తెలిపారు. అభివృద్ధికి నమూనా తెలంగాణ అని యావత్ దేశం సీఎం కేసీఆర్ పాలనను అభినందిస్తుంటే.. రాజగోపాల్‌రెడ్డి మాత్రం బీజేపీలో చేరి అభివృద్ధి కోసం చేరాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
మునుగోడు, ఆగస్టు 27 : బండి కింద పోయే కుక్కల మాదిరిగా కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలు మారాయని, ఆ బండిని మోసేది తామే అనే భ్రమలు కల్పించడంలో వారిది అందె వేసిన చెయ్యి అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మొన్నటి అమిత్‌షా సభకు జనాలను పంపింది భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డే అని ఆరోపించారు. రానున్న మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ మెజార్టీతో గెలవడం ఖాయమని, బీజేపీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. యావత్ దేశం అభివృద్ధికి నమూనా తెలంగాణ అని కేసీఆర్ పాలనను అభినందిస్తుంటే.. రాజగోపాల్‌రెడ్డి మాత్రం బీజేపీలో చేరి అభివృద్ధి కోసం చేరాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీజేపీ నాయకులు చెబుతున్న గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటే మోటర్లకు మీటర్లు పెట్టడమేనా అని ప్రశ్నించారు.
అభివృద్ధి కోసమే బీజేపీలో చేరానని అంటున్న రాజగోపాల్‌రెడ్డి.. రూ.400 ఉన్న గ్యాస్ ధరను రూ.1,100కు పెంచడమే అభివృద్ధా అని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వృద్ధులకు పింఛను నెలకు రూ.700 మాత్రమే ఇస్తున్నారని, తెలంగాణలోనూ పింఛన్లను తగ్గించేందుకే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరాడా అని ప్రశ్నించారు. గుజరాత్ బాస్‌లకు గులాంగిరి చేసేందుకే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతుబాంధవుడిలా మారారని, ప్రధాని మోడీ మాత్రం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారని విమర్శించారు. సమావేశంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, మార్కెట్ వైస్ చైర్మన్ జాజుల అంజయ్య, వైస్ ఎంపీపీ అనంత వీణ, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీశ్, జిల్లా మాజీ కార్యదర్శి గుర్రం సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐతగోని లాల్‌బహదూర్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రావిరాల కుమారస్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.