మోటకొండూర్, ఆగస్టు 27 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న రాష్ర్టాభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలోని స్వగృహంలో మోటకొండూర్ మండల కేంద్రంతో పాటు చామాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 200మంది శనివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మహేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కుందారం పద్మ, కిష్టయ్య, యాదయ్య, రాంచందర్, పల్లె మదార్, శంకర్, కొల్లూరి మధు, ప్రవీన్, వంగపల్లి మధు, జనగాం సతీశ్, మహేశ్, నవీన్, నరేశ్ ఉన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ అయిలయ్య, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, యూత్ విభాగం మండలాధ్యక్షుడు బీస కృష్ణంరాజు, పార్టీ సెక్రటరీ జనరల్ ఎర్ర మల్లేశ్‌యాదవ్, ఏనుగు అంజిరెడ్డి, చంద్రారెడ్డి, ఆరెగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు పైళ్ల పాండురంగారెడ్డి, మోటకొండూర్ యూత్ అధ్యక్షుడు బొట్ల మహేశ్, మహేంద్రన్న యువసేన నాయకులు పల్లపు మధు పాల్గొన్నారు.
గుండాల : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎండీ.ఖలీల్, నూనెగూడెం సర్పంచ్ తూనం రమేశ్ ఆధ్వర్యంలో మండలంలోని నూనెగూడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 50మంది యాదగిరిగుట్టలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో తూనం సతీశ్, అండెం నర్సిరెడ్డి, ఎల్లారెడ్డి, కారుపోతుల ఐలయ్య, బుషిగంపల రాములు, తూనం సైదులు, రాములు, మద్దెపురం సోమయ్య, సోమనర్సయ్య, వంటేరు శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కోలుకొండ రాములు, ఉపసర్పంచ్ గన్న మాధవరెడ్డి, మైనార్టీ సెల్ మండల నాయకులు ఎండీ.అన్వర్, గ్రామశాఖ అధ్యక్షుడు ఆలేటి మల్లారెడ్డి, అండెం రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.