తుర్కపల్లి, ఆగస్టు 27 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రుస్తాపురం గ్రామానికి చెందిన బూడిద జ్యోతికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును శనివారం యాదగిరిగుట్టలోని ఆయన నివాసంలో లబ్ధిదారురాలికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బూక్యా రవీందర్‌నాయక్, ప్రసాద్, నర్సింహులు, లచ్చిరాం, మోతీరాం, రాంసింగ్ పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండలంలోని మర్యాల గ్రామానికి చెందిన సంగి సుదర్శన్ రూ.45,500 వేలు, రాగీరు వెంకటేశానికి రూ.30వేలు, విడియాల లక్ష్మీనారాయణ రూ.60 వేలు, మన్నె సుగుణమ్మ రూ.35,500, విడియాల నాగరాజు రూ.30వేల సీఎం సహాయనిధి చెక్కులను మాజీ మార్కెట్ కమిటీ డైరక్టర్ మన్నె శ్రీధర్ శనివారం లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొలగోని వెంకటేశ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఈదులకంటి రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు బండ శ్రీధర్, నాయకులు కుర్మిండ్ల ఈశ్వర్‌గౌడ్, అన్నారం గణేశ్, బండ పాండు, సంగి రాజు, ప్యారారం రాములు, బ్రహ్మచారి, ఈదులకంటి మాధవరెడ్డి, ముద్దం ఉదయ్‌కుమార్‌రెడ్డి, తూముకుంట సాయి, ప్యారారం అనిల్, సాయికుమార్ పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన జూకంటి గణేశ్‌కు రూ.60వేలు, బండి ఉపేశ్కు రూ.60వేలు, కళ్లెపు శ్రీనివాస్‌కు రూ.60వేల సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను టీఆర్ఎస్ నాయకులు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జూకంటి అనూరాధాఅనిల్, ఉప సర్పంచ్ నీల రామన్న, చింతకింది నర్సింహులు, ఎలగందుల వెంకటేశ్వర్లు, కళ్లెపు రమేశ్, కందుల యాదగిరి, సామల రాంనర్సయ్య, ఎలగందుల రామరుషి, శ్రవణ్ పాల్గొన్నారు.