సూర్యాపేట టౌన్, ఆగస్టు 22 : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట పట్టణం ప్రగతిలో ఉన్న పనులను నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. నాణ్యత పాటించడంతోపాటు పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోపు అందుబాటులోకి తేవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న మహా ప్రస్థానాన్ని సోమవారం సంబంధిత అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. సొంత ఇల్లు లేనివారికి వారి సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల కోసం ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోమని, నాణ్యతలో రాజీ పడేదిలేదని చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అభివృద్ధితోపాటు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సంచలనాత్మకంగా ప్రసాదించిన సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్నన్నారు. రోడ్ల విస్తరణ, పార్కుల పునరుద్ధరణతోపాటు అన్ని సౌకర్యాలతో ఎవరూ ఊహించని అభివృద్ధి సాధమైందని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, కీసర వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డితోపాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.