నేరేడుచర్ల, ఆగస్టు 22 : రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా, ధైర్యం సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందనే నమ్మకంతోనే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలస వస్తున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని బక్కయ్యగూడెం గ్రామ పంచాయతీ మూడో వార్డు సభ్యురాలు కర్నం నాగమ్మ, కాంగ్రెస్ నాయకులు కర్నం సత్యం, గుండు సైదులు, కీత ఓంకారంతో పాటు పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాయ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలువురికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, హుజూర్నగర్, నేరేడుచర్ల మార్కెట్‌కమిటీ చైర్మన్లు కడియం వెంకటరెడ్డి, ఇంజమూరి యశోధారాములు, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ అనంతు శ్రీను, ఉపాధ్యక్షుడు వస్కుల సుదర్శన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గురవయ్య, ఎంపీటీసీలు రాజేశ్, శ్రీలక్ష్మి, ఉప సర్పంచ్ కర్నం నర్సయ్య పాల్గొన్నారు.