చివ్వెంల, ఆగస్టు 21 : రాష్ట్ర ప్రభుత్వం పార్కుల సుందరీకరణకు అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం చివ్వెంల మండలం ఉండ్రుగొండ శివారులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంద్రగొండ అర్బన్ పార్క్‌ను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణతో కలిసి పార్రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి కింద 144 పార్కులు, పల్లె ప్రగతి కింద 679 పార్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పట్టణాలకు పోటీగా పల్లెల్లో సైతం గణనీయంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. పల్లె, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పార్కుల్లో అధిక శాతం పండ్లు, పూల మొక్కలతోపాటు అటవీ జాతికి చెందిన మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. పార్కుల్లో అన్నిరకాల వసతులు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్‌నాయక్, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, డీఎఫ్ఓ ముఖుంద్రెడ్డి, జడ్పీ సీఈఓ సురేశ్, డీఆర్డీఓ కిరణ్‌కుమార్, డీపీఓ యాదయ్య, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎంపీడీఒ లక్ష్మి, ఏపీఓ నాగయ్య, సర్పంచ్ పల్లేటి శైలజానాగయ్య, టీఆర్ఎస్ నాయకులు రౌతు నర్సింహారావు, గుర్రం సత్యనారాయణరెడ్డి, లచ్చిరాంనాయక్, ఊట్కూరి సైదులు, పుట్ట గురువేందర్, పచ్చిపాల అనిల్, యలగబోయిన శ్రీరాములు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.