హాలియా, ఆగస్టు 21 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం హాలియాలో మున్సిపల్ పాలకవర్గం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ వెంపటి పార్వతమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, అన్నెపాక శ్రీను, ప్రసాద్‌నాయక్, వర్రా వెంకట్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.
బాధ్యతగా మొక్కలు నాటాలి
కొండమల్లేపల్లి : ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీఓ బాలరాజురెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వీరబాబు, ఎంపీటీసీ చెన్నగోని శివగౌడ్, పెద్దిశెట్టి సత్యం, టెక్నికల్ అసిస్టెంట్ గోపాల్ ల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాలి
కట్టంగూర్ : మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండల పరిషత్ ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్, ఏపీఓ కడెం రామ్మోహన్, సూపరింటెండెంట్ చింతమల్ల చలపతి, మాజీ సర్పంచులు గద్దపాటి దానయ్య, గడుసు శంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ నిర్మల పాల్గొన్నారు.
మొక్కల నాటింపు
దామరచర్ల : మండలంలోని వాచ్యాతండాలో ఆదివారం సర్పంచ్ లావూరి శ్రీను ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు చిహ్నంగా మొక్కలు పెంచుతామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లావూరి సైది, ఉపసర్పంచ్ కంసాలి, కార్యదర్శి స్వప్న, నాయకులు లక్కీసింగ్, తేజానాయక్, సేవానాయక్, బంగ్యానాయక్, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
దేవరకొండరూరల్ : మండలంలోని బద్యానాయక్తండాలోని పల్లె ప్రకృతి వనంలో ఎంపీడీఓ రామకృష్ణ, సర్పంచ్ సీతాశ్రీనునాయక్తో కలిసి మొక్కలు నాటారు. మర్రిచెట్టుతండాలో గ్రామ సర్పంచ్ శ్రీనునాయక్, ఎక్సైజ్ ఎస్ఐలు సూర్యప్రకాశ్, రవికుమార్ ఈత, ఖజ్జూర మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కీర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు.
నందికొండలో..
నందికొండ : వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నందికొండలోని పైలాన్‌కాలనీ 12వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. 3వ వార్డులో కౌన్సిలర్ శిరీషమోహన్నాయక్ దోమల నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ ఇర్ల రామకృష్ణ, అల్ ఇండియా బంజారా సేవా సంఘం పట్టణాధ్యక్షుడు రమావత్ మోహన్‌నాయక్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, హైమావతి, జానకిరెడ్డి, రంగానాయక్ పాల్గొన్నారు.
చందంపేట : బృహత్ పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు ఆక్సిజన్ అందిస్తున్నాయని హంక్యాతండా సర్పంచ్ మంగమ్మారమేశ్ అన్నారు. ఆదివారం గ్రామంలోని బృహత్ పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీఓ వరలక్ష్మి, టీఏ జవహర్లాల్ పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచులు మొక్కలు నాటారు. రామగిరిలో సర్పంచ్ బండారు శంకరయ్యగౌడ్, అంబారిపేటలో బీరం శోభానర్సిరెడ్డి, ఆకారంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కందాల సమరంరెడ్డి, గౌర వీరయ్య, ఎంపీటీసీ పాక రాములు, ఉప సర్పంచ్ ఆకుల శ్రీను, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎర్ర బుచ్చయ్య, సైదులు పాల్గొన్నారు.
తిప్పర్తి : మండలంలోని రామలింగాలగూడం గ్రామంలో సర్పంచ్ ముత్తినేని శ్రీదేవీశ్యాంసుందర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ముత్తినేని శ్యాంసుందర్, నాయకులు వలిశెట్టి మల్లయ్య పాల్గొన్నారు.
మానవాలి మనుగడకు చెట్లే ఆధారం
మిర్యాలగూడ రూరల్ : మానవాళి మనుగడకు చెట్లే ఆధారమని , అందుకే మొక్కలు నాటి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. ఆదివారం వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలోని జంకుతండాలో గ్రామస్తులతో కలిసి సామూహిక హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరివిగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపీఓ వీరారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, సర్పంచ్ రవీందర్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు దోహదం
డీఆర్డీఓ కాళిందిని
వేములపల్లి : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని డీఆర్డీఏ పీడీ కాళిందిని అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఎంపీపీ పుట్టల సునీతతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విరివిగా మొక్కలు నాటడం వల్ల వాతావరణ సమతుల్యతతో పాటు స్వచ్ఛమైన ప్రాణ వాయువు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అజ్మీర దేవిక, సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, ఎంపీటీసీ పల్లా వీరయ్య, ఎంపీఓ సంగీత, కార్యదర్శి శ్రవణ్‌కుమార్, సుజాత, తులసి, నరేందర్, పుట్టల భాస్కర్, దైద జాన్సన్, ఇరుగు వెంకటయ్య, సందీప్, కృపయ్య పాల్గొన్నారు.