నందికొండ, ఆగస్టు 19 : శ్రీశైల నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 2,86,991 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా డ్యాం 16 క్రస్ట్ గేట్ల ద్వారా 1,23,056 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉదృతి తగ్గడంతో క్రస్ట్ గేట్లను తగ్గిస్తూ శుక్రవారం నాడు 16 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగించారు.
నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590(312 టీఎంసీలు) అడుగుకులకు గాను 586.10(300.8385 టీఎంసీలు) అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ 16 క్రస్ట్ గేట్లు ద్వారా 1,23,056 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 9,076 ఎడమ కాల్వ ద్వారా 8,193, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,048, ఎస్ఎల్బీసీ ద్వారా 600, ఎల్ఎల్సీ ద్వారా 400 మొత్తం 1,74,373 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 884.90(215.3263 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌కు 2,61,019 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల ద్వారా 62,759 క్యూసెక్కులు, 8 క్రస్ట్ గేట్ల ద్వారా 2,24,232 క్యూసెక్కులతో కలిపి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 2,86,991 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు కొనసాగుతుంది.
అడవిదేవులపల్లి : మండల కేంద్రానికి చేరువలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకి శుక్రవారం వరద ప్రవాహం తగ్గింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సుమారు 1,55,366 క్యూసెక్కులు వస్తున్నదని ఇన్చార్జీ ఏడీ కె. నరసింహరావు తెలిపారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు 8 క్రస్ట్ గేట్లు 3.50 మీటర్ల మేర ఎత్తి 1,48,014 క్యూసెక్కుల నీటిని దిగువన పులిచింతల ప్రాజెక్ట్‌కు వదులుతున్నట్లు చెప్పారు. టెయిల్‌ఫాండ్ నీటి నిల్వ సామార్థ్యం 7.080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.186 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
కేతేపల్లి : నెల రోజులుగా నిరాటంకంగా సాగుతున్న మూసీ ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదలను శుక్రవారం అధికారులు నిలిపివేశారు. ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి శుక్రవారం 813.21 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా కుడి కాల్వకు 248.39 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 263.00 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 638.72(2.93 టీఎంసీలు)అడుగులుగా ఉన్నట్లు ఏఈ ఉదయ్‌కుమార్ తెలిపారు.