మునగాల, ఆగస్టు 2 : స్వరాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యకు చెక్ పడిందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నీటిని విడుదల చేసి మాట్లాడారు. రైతులకు సకాలంలో నీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సాగర్ నీటిని విడుదల చేసిందని తెలిపారు. సమైక్య పాలనలో నీటి విడుదల కోసం రైతులు ఎన్నో పోరాటాలు చేసేవారని, నేడు రైతులు అడుగక ముందే నీటిని విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కాల్వలో ప్రవహించే నీటికి చీరె, సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హూజూర్‌నగర్ ఎంపీపీ శ్రీనివాస్, డిస్ట్రిబ్యూషన్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల కోటిరెడ్డి, నీటి పారుదల శాఖ ఎస్ఈ నర్సింహారావు, ఈఈ సత్యనారాయణ, ఏఈలు నరేందర్, సత్యనారాయణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సుంకర అజయ్‌కుమార్, సర్పంచులు చింతకాయల ఉపేందర్, కొప్పుల వీరమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్, నాయకులు నల్లపాటి శ్రీనివాస్, ఉప్పుల యుగంధర్‌రెడ్డి, గన్నా నర్సింహారావు, బంగారు సత్యం, ఉడుం కృష్ణ, పాషా పాల్గొన్నారు.