దేవరకొండ, జూలై 30 : మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పీఏపల్లి మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు శనివారం క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఏపల్లి మండలంలో ఇప్పటి వరకు 1,420 మంది లబ్ధిదారులకు రూ. 14.90 కోట్ల కల్యాణలక్ష్మి చెక్కులను అందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆమెకు వివాహం అయ్యేంత వరకు ప్రభుత్వం అండగా ఉంటున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెలుగూరి వల్లపురెడ్డి, వైస్ ఎంపీపీ సరితా నర్సింహ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, శ్రీను, శీలం శేఖర్‌రెడ్డి, నరేందర్, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్, జగన్, గుండాల శ్రీనివాస్, స్వామీనాయక్, కలమ్మ, కర్ణయ్య పాల్గొన్నారు.
ఎల్లమ్మ మృతికి సంతాపం
పట్టణానికి చెందిన సీపీఎం నాయకుడు బిజిలీ లింగయ్య భార్య ఎల్లమ్మ శనివారం మృతి చెందగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్‌నాయక్, బొడ్డుపల్లి కృష్ణ ఉన్నారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
కొండమల్లేపల్లి : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం టీఆర్ఎస్ దేవరకొండ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది. సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే పునాదులన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్‌అలీ, పార్టీ పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ర ్టనాయకులు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, గాజుల ఆంజనేయులు, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, మహ్మద్రైస్, పొట్టమధు, నున్సావత్ అభిషేక్, జయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్‌నాయక్, గార్లపాటి దామోదర్, ఇలియాస్ పటేల్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.