
నల్లగొండ ప్రతినిధి, జనవరి 10 (నమస్తే తెలంగాణ): జిల్లాలో రైతు బంధు సంబురాలు జోరందుకున్నాయి. పెట్టుబడి సాయంతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు పాల్గొని సంబురాలు హోరెత్తిస్తున్నారు. .
రాష్ట్రంలోనే రైతులకు సంక్షేమ ఫలాలు
కేతేపల్లి, జనవరి 10 : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఆయనతోనే వ్యవసాయం పండుగలామారిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మండలంలోని భీమారంలో సోమవారం నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఎద్దుల బండి ఎక్కి రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం ఒక్క పథకం ద్వారా రూ.50 వేల కోట్లను రైతులకు అందివ్వడం సాధారణ విషయం కాదన్నారు. ప్రాజెక్టులను నిర్మించి సాగునీటితోపాటు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. వివిధ గ్రామాల నుంచి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో గ్రామంలో కోలాహలంగా మారిం ది. సర్పంచ్ బి.శ్రీనివాస్‌యాదవ్, ఏఓ బి.పురుషోత్తం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మారం వెంకట్‌రెడ్డి, వెంకన్నయాదవ్, నాయకులు జి.నాగరాజు, జి.వెంకటయ్య, సయ్యద్ ఫరీద్, రషీద్, చేతన్ పాల్గొన్నారు.
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
అనంతగిరి/నడిగూడెం/మునగాల, జనవరి10 : అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని, రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం అనంతగిరి మండలంలోని ఖానాపురం నుంచి అనంతగిరి వరకు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన రైతు సమ్మేళనంలో మాట్లాడారు. దేశంలో వ్యవసాయాన్ని ఒక ఆర్థిక సంస్కరణగా సీఎం కేసీఆర్ మాత్రమే గుర్తించారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చుండూరి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ ఉమాశ్రీనివాస్రెడ్డి, ఏడీఏ వాసు, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ఈదుల కృష్ణయ్య, మండల కో ఆర్డినేటర్, అనంతగిరి సర్పంచ్ వేనేపల్లి వెంకటేశ్వర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గింజుపల్లి రమేశ్, యాకూబ్, బుర్రా నరసింహారెడ్డి, నాగరాజు, శ్రీనివాస్‌నాయక్, వెంకటప్పయ్య, ఖాజా, భిక్షం, పుల్లయ్య, భిక్షం, పూర్ణచందర్రావు పాల్గొన్నారు.
అలాగే నడిగూడెం మండలం సిరిపురం రైతు వేదికలో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, రైతు బంధు సమితి మండల సభ్యుడు కాసాని వెంకటేశ్వర్లు, ఏడీఏ వాసు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బడేటి చంద్రయ్య, పాలడగుప్రసాద్, కాసాని వెంకన్న, గడ్డం నాగలక్ష్మీమల్లేశ్యాదవ్, దేవబత్తిని వెంకటనర్సయ్య, దేవబత్తిని సురేశ్ప్రసాద్, రాజేశ్, కాసాని పుల్లయ్య, ఉపేందర్, శ్రీనివాస్, జానకిరామయ్య, వీరభద్రం, అనంతుల ఆంజనేయులు, ఏఓ రాజగోపాల్ పాల్గొన్నారు. మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ సుంకర అజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్, కార్యదర్శి ఎలక వెంకటరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, నాయకులు నల్లపాటి శ్రీనివాస్, ఉప్పుల యుగంధర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోల ఉపేందర్‌రావు, బంగారపు సత్యం, దొంగరి శ్రీనివాస్, శ్యామ్‌సుందర్‌రెడ్డి, లింగారెడ్డి, చింతకాయల ఉపేందర్ పాల్గొన్నారు.
పంట గింజలతో అభిమానం
బొడ్రాయిబజార్, జనవరి 10 : రైతు బంధు పథకం ద్వారా 50వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మహా సంకల్పానికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీఆనంద్ ఆధ్వర్యంలో వివిధ రకాల పంట గింజలతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జగదీశ్‌రెడ్డి చిత్రాలు రూపొందించి అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా కందులతో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి అభిషేకం చేసి కేక్‌కట్ చేశారు. దేశంలో రైతుల గురించి ఆలోచించి వారి సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్న రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీఆనంద్ అన్నారు. కాళేశ్వరం జలాల రాకతో జిల్లాలో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు, మార్కెటింగ్ అధికారి సంతోష్‌కుమార్, మార్కెట్ డైరెక్టర్లు సల్మా మస్తాన్, ముప్పారపు నాగేశ్వర్రావు, భరత్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎండీ ఫసియొద్దీన్, అసిస్టెంట్ సెక్రటరీ పుష్పలత, యూడీసీ ఖాసిం, సూపర్వైజర్ శ్రావణ్, నాయకులు ఉప్పల ఆనంద్, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు, మార్కెట్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
కర్షక హితుడు సీఎం కేసీఆర్
రామన్నపేట, జనవరి10 : తెలంగాణను అన్నపూర్ణగా చేసిన కర్షకహితుడు, రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ నుంచి దుబ్బాక గ్రామంలోని ఆసిఫ్నెహర్ శివారు వరకు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు పొలంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయంగా 50వేల కోట్ల రూపాయలను అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజల దీవెనలు, రైతుల ఆశీస్సులతో కేసీఆర్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తంచేశారు.
రైతు బంధుతో అన్నదాతల జీవితాల్లో వెలుగులు
కనగల్, జనవరి 10 : రైతు బంధు పథకం అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కనగల్ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద నిర్వహించిన రైతు బంధు సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఎడ్ల బండిపై వచ్చి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలోనే రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని, వారికి రైతులు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్యగౌడ్, వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్‌రావు, తాసీల్దార్ శ్రీనివాస్‌రావు, పీఏసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, రైతు సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి నర్సిరెడ్డి, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మర్రి రేణుక, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఏఓ అమరేందర్‌గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.