
కట్టంగూర్, జనవరి 10 : కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కురుమర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన చిన్న చంద్రయ్య గతేడాది ప్రమాదవశాత్తు మృతి చెందాడు. టీఆర్ఎస్ సభ్యత్వం ఉండడంతో మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును కట్టంగూర్‌లో బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సోమవారం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, సర్పంచ్ గుర్రం సైదులు, ఎంపీటీసీ బీరెల్లి రాజ్యలక్ష్మీప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ చైర్మన్ కుందారపు వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, గ్రామ శాఖ అధ్యక్షుడు పొడిచేటి సైదులు పాల్గొన్నారు.
మునుగోడులో..
మునుగోడు : ఇటీవల మృతిచెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు కొంక రవి(చొల్లేడు), గొలుసుల శ్రీనివాస్(పలివెల)కు మంజూరైన పార్టీ బీమా చెక్కులను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అందజేశారు.
సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత
మునుగోడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.4.45 లక్షలు మంజూరయ్యాయి. సంబంధిత చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కర్నాటి స్వామి, ఎంపీటీసీలు వనం నిర్మల, చెరుకు కృష్ణయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ.రఫిక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాజుల అంజయ్యగౌడ్, నాయకులు గోదాల శంకర్‌రెడ్డి, దొడ్డి రామకృష్ణ, బోయపల్లి రవి, మాదగోని దేవలోకం, ధర్మయ్య, పూల వెంకటేశ్ పాల్గొన్నారు.