నల్లగొండ రూరల్, జూలై 7: ఆహారం కల్తీ చేస్తే ఉపేక్షించేది లేదని జోన్ -5 అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ జ్యోతిర్మయి స్పష్టం చేశారు. నల్లగొండ ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏడాది కాలంలో రూ.1.30 కోటి విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం ఆహా ర కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తుందని, ఫుడ్ సెఫ్టీ శాఖ మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఆహార కల్తీ జరుగుతుందని పలువురు ఆరోపణలు చేయ డం సరైంది కాదన్నారు.
జిల్లాలో ప్రము ఖ హోటళ్లు, ఆయిల్ మిల్స్ యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. సూర్యాపేటలో నకిలీ టీ పోడి విక్రయిస్తున్న 18 మందిని గుర్తించి వారిపై కేసు లు పెట్టి జైలుకు పంపినట్లు తెలిపారు. ఆహార పరిరక్షణకు తమ బా ధ్యతగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు కూడా కల్తీలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈసమావేశంలో డ్రాయింగ్ ఆఫీసర్ ధర్మేంద్ర, జిల్లా ఫుడ్ సెఫ్టీ అధికారి స్వాతి, సూర్యాపేట అధికారి కృష్ణమూర్తి పాల్గొన్నారు.