మిర్యాలగూడ, జూలై 7 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల ప్రమాదాల్లో మృతి చెందగా, వారికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మంజూరైన చెక్కులను అందజేసి మాట్లాడారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబాలకు బాసటగా నిలువాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రమాదబీమా సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, యూసూఫ్, సిద్ధయ్య, అమరావతి సైదులు, మట్టపల్లి సైదులుయాదవ్, రామకృష్ణ, ఏడుకొండల్ అనంతలక్ష్మి పాల్గ్నొనారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాద్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకం నిలిపేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రవీందర్‌సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకంతో వాతావరణం కాలుష్యమయం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించాలని సూచించారు. వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మెప్మా అధికారి బక్కయ్య పాల్గొన్నారు.