కట్టంగూర్, జూలై 6 : కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతునున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని గార్లబాయిగూడెంలో రూ. 20 లక్షలతో సీసీ రోడ్లపనులతో పాటు ప్రాథమిక పాఠశాలలో రూ.6 లక్షలు, చెర్వుఅన్నారం ప్రాథమిక పాఠశాలలో రూ.70 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యంలో బోధన చేపట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, ఎంఈఓ మేక నాగయ్య, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, ఎంపీటీసీ పాలడుగు హరికృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఏపీఎం చౌగోని వినోద, ఆయా గ్రామాల సర్పంచులు బోడ సరితాయాదగిరి, నంద్యాల చైతన్య, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, ఉప సర్పంచులు ఆవులు సైదులు, పోడిచేటి సునీత, అంతటి శ్రీనివాస్, గుండగోని రాములు, నాయకులు బీరెల్లి ప్రసాద్ పాల్గొన్నారు.
దవాఖాన నిర్మాణానికి స్థల పరిశీలన
నకిరేకల్: నకిరేకల్‌లో 100 పడకల దవాఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆ శాఖ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మురారిశెట్టి కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఎల్ఓసీ అందజేత
కేతెపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన జానపాటి శివశంకర్‌కు రూ. లక్ష ఎల్ఓసీ మంజూ రైంది. సంబంధిత చెక్కును లబ్ధిదారుడికి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చిరుమర్తి అందజేశారు.