పెద్దవూర, జూలై 6 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం మండలంలోని తుంగతుర్తిలో 20 కుటుంబాలు స్థానిక సర్పంచ్ మెండె విష్ణుప్రియాసైదులు చొరవతో ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్రెడ్డి, ఎంపీటీసీ జ్యోతీకృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, ఉప సర్పంచ్ పగడాల గోపమ్మావెంకట్రెడ్డి, షేక్ అబ్బాస్, షేక్ బషీర్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముత్యాలు పాల్గొనగా, పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీఎస్ దుగ్యాల సాంబయ్య, జూపల్లి ముత్తమ్మ, మోర రాంబాబు, దారెడ్డి రమేశ్, దుగ్యాల జంగమ్మ, నడ్డి లక్ష్మమ్మ, నోడంగి లింగయ్య తదితరులు ఉన్నారు.