నేరేడుచర్ల, జూన్, 21 : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 29న హుజూర్‌నగర్‌కు రానున్నారు. నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన రైతు వేదిక, గిరిజన భవన్,ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, ఈఎస్ఐ ఆస్పత్రిని మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతిరాథోడ్‌తో కలిసి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఆమేరకు మంగళవారం ఆయా భవన నిర్మాణాలను పరిశీలించారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రారంభోత్సవాల అనంతరం గిరిజన భవన్ పక్కనున్న రామస్వామిగట్టు వద్ద నిర్వహించునున్న బహిరంగ సభకు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శానంపూడి కోరారు. ఆయన వెంట జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కొండానాయక్, మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్,టీఆర్ఎస్ నాయకులు అమర్నాథ్రెడ్డి, పచ్చిపాల ఉపేందర్, గోపిరెడ్డి, విజయ్ ఉన్నారు.