మిర్యాలగూడ రూరల్, జూన్ 21 : ప్రొఫెసర్ జయశంకర్ సర్ చూపిన మార్గం అనుసరణీయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం క్యాంపు కార్యాలయంలో సర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతూ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన నిరంతర కృషి, ఆయన దృఢ సంకల్పం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ లావూరి మేగ్యానాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొనుగోటి చొక్కారావు, వాచ్యతండా సర్పంచ్ లావూరి శ్రీనునాయక్, మాజీ సర్పంచ్ పాచ్యూనాయక్ పాల్గొన్నారు.
రాజీవ్‌చౌక్ వద్ద ..
జేఏసీ, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌చౌక్ వద్ద ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, మారం శ్రీనివాస్ , ఈశ్వర్, నాగార్జునాచారి, శేఖర్, ఆచారి, శ్రీనివాస్‌చారి, జయరాజు, నాగాచారి, నాగభూషణం, షోయబ్, వెంకటయ్య పాల్గొన్నారు.
త్రిపురారం : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సర్ చిత్రపటానికి సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలకొండ సైదులు, చింతకాయల యాదయ్య, అవిరెండ్ల సైదులు, మట్టయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
చండూరు : ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు జయశంకర్ సర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు భూతరాజు దశరథ, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, కౌన్సిలర్లు కోడి వెంకన్న అన్నెపర్తి శేఖర్, కోన్‌రెడ్డి యాదయ్య, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, గుండమళ్ల శ్రీనివాస్, మోగుదాల దశరథ, జూలూరి శ్రీనివాస్, బొడ్డు సతీశ్, తేలుకుంట్ల చంద్రశేఖర్, చొప్పరి వెంకన్న, కావలి ప్రసాద్, రవి పాల్గొన్నారు.
సార్ ఆశయసాధనకు కృషి చేయాలి
కట్టంగూర్(నకిరేకల్) : ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య అన్నారు. నకిరేకల్‌లోని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయంలో జయశంకర్ సర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు లింగారెడ్డి, శ్రీనివాస్, వెంకన్న, యాదగిరి పాల్గొన్నారు.