భువనగిరి అర్బన్ : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్యా ప్రధాన న్యాయమూర్తి వి.భాస్కర్‌రావు అన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు భువనగిరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రూప్ సహకారంతో కోర్టు ఆవరణలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి యోగాసనాలు వేసి మాట్లాడారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి మారుతీదేవి, సీనియర్ సివిల్ జడ్జి రజిని, జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కవిత, స్పెషల్ మేజిస్ట్రేట్ జావిద్, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి రాంరెడ్డి పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : రోజూ యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పట్టణ పరిధిలోని సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సాధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. యోగా ఒక్కరోజు చేసి ఆపొద్దని, నిత్యం చేయాలని సూచించారు. యోగాతో మానసిక ప్రశాంతత పొందవచ్చని, దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, దీపక్ తివారీ, జిల్లా ఆయుష్ ఇన్చార్జి డాక్టర్ పృథ్వీరాజ్, ఆయుష్ అధికారులు, పారా మెడికల్ సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.
వలిగొండ మండలంలో..
వలిగొండ : మండల కేంద్రంలోని ప్రగతి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గాయత్రీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులతో యోగాసనాలు చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రామన్నపేట మండలంలో..
రామన్నపేట : యోగాతో ఉత్తేజకర ఆరోగ్యం లభిస్తుందని రామన్నపేట జూనియర్ సివిల్ జడ్పి అర్జున్, అదనపు కోర్టు జడ్జి తులసీదుర్గారాణి అన్నారు. కోర్టు ఆవరణ, ప్రభుత్వ దవాఖాన, ప్రభుత్వ డీగ్రీ, జూనియర్ కళాశాలల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేశారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యురాలు నుస్రత్, డాక్టర్ లక్ష్మి, ప్రిన్సిపాళ్లు బెల్లి యాదయ్య, బుంగ సంజీవ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జినుకల ప్రభాకర్, కార్యదర్శి నకిరేకంటి మొగలయ్య పాల్గొన్నారు.
చౌటుప్పల్ మండలంలో..
చౌటుప్పల్ : మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, పైలాన్ పార్క్‌లో భారత్ వికాస్ పరిషత్ సభ్యులు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో చింతల తిరుమల్‌రెడ్డి, బీమిడి మోహన్‌రెడ్డి, ఊడుగు రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని ఎస్.లింగోటంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా గురువు పాండు ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్యగౌడ్, ఉప సర్పంచ్ గంగాపురం గంగాధర్‌గౌడ్, సరిత, గంజి గణేశ్, ఆకుల శంకరయ్య, యాదగిరి పాల్గొన్నారు.
మోత్కూరు ఉన్నత పాఠశాలలో..
మోత్కూరు : యోగా మానసిక ప్రశాంతతకు దోహదపడుతోందని మోత్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజయ్య అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధర్మారపు వెంకటయ్య, గాదె వెంకటేశ్వర్లు, బందారపు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట మండలంలో..
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని రామాజీపేటలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీడీఓ కారం ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగాసనాల గురించి గ్రామస్తులకు వివరించారు. ప్రతి ఒక్కరూ యోగా చేసేందుకు నిత్యం కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. సర్పంచ్ మొగిలిపాక తిరుమలారమేశ్, ఎంపీఓ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
బొమ్మలరామారం మండలంలో..
బొమ్మలరామారం : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఉపాధ్యాయులు యోగాతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ఉపేంద్ర, సీవీ శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.
ఆలేరు మండలంలో..
ఆలేరురూరల్ : మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, ఎంపీఓ సలీం, సర్పంచులు ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, బక్క రాంప్రసాద్, వడ్ల నవ్య, వార్డు సభ్యులు
మోటకొండూరు మండలంలో..
మోటకొండూర్ : మండలంలోని పలు పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని గురుకుల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగాసనాలు వేశారు.
భువనగిరి కలెక్టరేట్ : జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా క్రీడల అధికారి ధనాంజనేయులు ఆధ్వర్యంలో ప్రాణాయామం, మెడిటేషన్ చేయించారు. నవభారత యువజన సంఘం అధ్యక్షుడు కారుణ్, సిబ్బంది సిలివేరు సైదులు, మురళీ పాల్గొన్నారు.
ఆలేరు : ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల పాల్గొన్నారు.ఆత్మకూరు(ఎం) : ప్రపంచ యోగా దినోత్సవం మండలవ్యాప్తంగా నిర్వహించారు. మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో విద్యార్థులతోపాటు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు.