కొండమల్లేపల్లి, జూన్ 20 : తెలంగాణ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం కొండమల్లేపల్లి మండలంలోని దంజిలాల్తండాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించడంతో పాటు రూ.5లక్షలతో చేపడుతున్న మట్టి రోడ్డు, తాగుబోరు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవింధగా కొత్తబావి గ్రామంలో పంచాయతీ కార్యాలయం, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో క్రీడా మైదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీ దూదిపాల రేఖారెడ్డి, శిరందాసు కృష్ణయ్య, పస్నూరి యుగేందర్‌రెడ్డి, రమావత్ దస్రూనాయక్, రాంబాబునాయక్, మేకల శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్ జబ్బు యాద య్య, ఎంపీటీసీ రాణి, యాద య్య, రమావత్ తులసీరాం, లాలూనాయక్, బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ రూప్లా, రమావత్ బాలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలి
దేవరకొండ రూరల్ : ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని గొట్టిముక్కలలో నిర్వహించిన ధ్వజస్తంభం, వేంకటేశ్వరస్వామి, నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠోత్సవంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మమ్మ, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.