నల్లగొండ సిటీ, జూన్ 20 : గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధి గోపాలా యిపల్లీ, కట్టంగూర్ సమీపంలో పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర నుంచి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్ వెళ్తున్న XUV. 500 NO.. RJ 14 UD 1429 టాటా నెక్సో వాహనంతో పాటు NO.RJ07CD. 3630 నంబ రు గల రెండు వాహనాలు అనుమానాస్పందంగా కనిపించడంతో వాటిని తనిఖీ చేసినట్లు తెలిపారు. దీంతో ఆ వాహనాల్లో ఒక్కోటి 2 కిలోల చొప్పున 50 గంజాయి ప్యాకెట్లు లభించినట్లు చెప్పారు. అదుపులోకి తీసుకుని విచారించగా ఏపీలోని రా జమండ్రికి చెందిన చింతా వీరబాబు, పెద్దాడ నాగేశ్వర్రావు, బత్తిని చిట్టిబాబు, పెద్దపాటి నూకేశ్, బియ్యాల అప్పలనాయుడు, పెద్దదా చిరంజీవి, వూడి శివగణేశ్ నుంచి సంగారెడ్డి జిల్లాకు చెందిన రాథోడ్ అలియాస్ రాజు ద్వారా గంజాయిని కొనుగోలు చేసి రాజస్థాన్‌కు తరలిస్తున్నట్లు వెల్లడిం చారు. రాథోడ్, రవీందర్ అలియాస్ రాజు కూడా వీరి వెనకాల గంజాయి తీసుకుని KA38M 4055 నంబర్ గల i20 కారులో వస్తున్నట్లు తెల పడంతో కట్టంగూర్‌లోని నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక్కోటి 2 కిలోల బరువు గల 60 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం పట్టుబడిన 220 కిలోల గంజాయి విలువ రూ.12 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి మూడు కార్లు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ మొగిలయ్య, డీఎస్పీ నర్సింహారెడ్డి, నార్కట్‌పల్లి సీఐ శివరాంరెడ్డి, శాలిగౌరారం సర్కిల్ సీఐ రాఘవ రావు, నార్కట్‌పల్లి ఎస్ఐ రామకృష్ణ, కట్టంగూర్ ఎస్ఐ విజయ్‌కుమార్‌ను ఎస్పీ అభినందించారు.