నాంపల్లి జూన్ 18 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం కృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంభం విజయ, పంచాయతీ కార్యదర్శి ఎండీ.సత్తార్, వార్డు సభ్యులు కర్నె యాదయ్య, పెద్దరెడ్డి రాజశేకర్‌రెడ్డి, మహాత్మ, కుంభం అనిల్‌రెడ్డి, బెల్లి సత్తయ్య పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : ఈ నెల 3నుంచి ప్రారంభమైన 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంల శనివారం ముగిసింది. 15 రోజులగా నిర్వహించిన పనులపై గ్రామ సభల్లో చర్చించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో సర్పంచులు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించి సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్‌రెడ్డితో పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సత్తయ్య, ఉపసర్పంచ్ లింగయ్య, పంచాయతీ కార్యదర్శి సిద్దవీర సోమయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
మునుగోడు : మండలంలోని రావిగూడెంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాలన్నీ ఆహ్లాదకరంగా మారాయన్నారు. కార్యక్రమంలో మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, నోడల్ అధికారి లక్ష్మణాచారి, గుర్రం వెంకటయ్య, తీగల నర్సింహ, గుర్రం సైదులు, బొల్లు సైదులు, లక్ష్మయ్య, ఇద్దమ్మ, మధు, లింగయ్య, మమత, జ్యోతి పాల్గొన్నారు.