దామరచర్ల, జూన్ 18 : టీఆర్ఎస్ పాలనలో ప్రాచీన ఆలయాలు పునర్వైభవం సంతరించుకుంటున్నాయని, సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో అభివృద్ధికి కృషి చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని వాడపల్లి మీనాక్షీఅగస్తేశ్వర, లక్షీనర్సింహస్వామి, గంగమ్మ ఆలయాల్లో కుటుంబ సమేతంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లాలో తన బంధువుల ఇంటిలో జరిగిన శుభకార్యక్రమానికి మంత్రి తన సతీమణి, కుమారుడు, కుమార్తెతో వెళ్లి తిరుగు ప్రయాణంలో రాత్రి మండలంలో స్థానిక సిమెంట్ కర్మాగారంలో బసచేశారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మీనాక్షీఅగస్తేశ్వరస్వామి, లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకోగా అర్చకులు, కమిటీ సభ్యులు మంత్రికి కలశంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులు స్వామివారికి పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆలయాల విశిష్టత, కృష్ణామూసీ నదుల సంగమం గురించి తన పిల్లలకు మంత్రి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 3,645 ఆలయాలకు ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకం కింద 3, 500 బ్రాహ్మణులకు నెలకు ఆరు వేల చొప్పున ఏటా రూ.26 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. యాద్రాద్రి ఆలయం వెయేండ్లు చెక్కు చెదరకుండా నిర్మించారని, నల్లగొండ జిల్లా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి.నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి ఎంపీపీలు నూకల సరళ, బాలాజీనాయక్, వైస్ ఎంపీపీ కటికం సైదులురెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కె. వీరకోటిరెడ్డి, స్థానిక సర్పంచ్ కె.మాధవి, నాయకులు కె. సిద్ధయ్య, మారెళ్ల రాంరెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, చిట్టిబాబునాయక్, హాతిరాం, యూసుఫ్, బైరం గోపి, దత్తూనాయక్, ఆనంద్ పాల్గొన్నారు.
40 లక్షల మొక్కలు నాటాలన్న బ్రహ్మకుమారి మఠం సంకల్పం అభినందనీయం
మిర్యాలగూడ రూరల్ : బ్రహ్మకుమారి మఠం 40 లక్షల మొక్కలు నాటాలన్న సంకల్పం అభినందనీయమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణ పరిధి ఈదులగూడెం వద్ద గల బ్రహ్మకుమారి మఠంలో ఆ శాఖ అదనపు ఉపాధ్యక్షురాలు సంతోషి దీదీతో కలిసి 75వ అమృత మహోత్సవంలో పాల్గొన్నారు. దయ, కరుణ భావన ప్రాజెక్టును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. మానవ మనుగడకు మూలాధారమైన కల్పతరువు మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలను మఠం తీసుకోవడం సంతోషకరమన్నారు. ఆగస్టు 25 నుంచి మఠం ఆధ్వర్యంలో 40లక్షల మొక్కలు నాటితే అటవీ విస్తీర్ణం కొంత పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీటీసీ విజయసింహారెడ్డి, మున్సిల్ వైస్ చైర్మన్ కుర్రవిష్ణు, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, నాయకులు ఇంతియాజ్, రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సాధినేని శ్రీనివాస్, శ్రీవణ్రెడ్డి, సంతోష్‌రెడ్డి, జానకిరెడ్డి, శకుంతల పాల్గొన్నారు.
లక్ష్యం చేరే వరకూ విశ్రమించొద్దు : మంత్రి జగదీశ్‌రెడ్డి
మిర్యాలగూడ రూరల్ : ఉద్యోగార్థులు లక్ష్యం చేరే వరకూ విశ్రమించొద్దని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో ఎన్బీఆర్ ఫౌండేషన్, మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలోగ్రూప్ 2,3,4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను మంత్రి అందజేసి మాట్లాడారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ ఉత్తమమైన ఫ్యాకల్టీతో ఉచిత శిక్షణతోపాటు, మెటీరియల్ అందజేయడం అభినందనీయమన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అంతకు ముందు ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, జడ్పీటీసీ విజయసింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, టీఆర్ఎస్ నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ కర్ణాటి రమేశ్, పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గౌరు శ్రీనివాస్, బోగవిల్లి వెంకటరమణచౌదరి, గిరి పాల్గొన్నారు.