నార్కట్‌పల్లి, జూన్ 18 : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు, పట్టణాలు ఎంతో ప్రగతి సాధించాయని, గుడిలేని ఊరు లేదనేది ఎంత నిజమో పథకాలు అందని గ్రామాలు లేవనేది అంతే నిజమని జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నార్కట్‌పల్లి పట్టణంలోని 2, 5, 7, 8, 12 వార్డుల్లో రూ.40లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు.. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మూడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.1.20 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక అంగడి ప్రాంగణంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం ఆలోచించి పని చేసే నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.
పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని, వచ్చే నెలలో కొత్త పింఛన్లు అందిస్తుందని తెలిపారు. నార్కట్‌పల్లి పట్టణాన్ని రోల్ మోడల్‌గా తీర్చి దిద్దేందుకు పనులు జరుగుతున్నాయని, ప్రజల అభీష్టం మేరకు మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. అంతకుముందు కోలాటాలు ఆడుతూ మహిళలు వారికి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమలో మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, దుబ్బాక పావని శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దోసపాటి విష్ణుమూర్తి, సిరిపంగి స్వామి, మేడబోయిన శ్రీను, అజీజ్, పుల్లెంల మహేశ్, జొన్నలగడ్డ రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీ నరసింహ, పసునూరి శ్రీనివాస్, బొబ్బలి మల్లేశ్, వాజిద్ అలీ, బొబ్బలి దేవేందర్, యాదగిరి చాంద్‌పాషా, ప్రజ్ఞాపురం రామకృష్ణ, బోయపల్లి శ్రీను పాల్గొన్నారు.