చిట్యాల, జూన్ 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన ఆరూరి నర్సింహ, నాతి స్వామి, ఆరూరి అంజయ్య, ఆవుల నాగరాజు, ఆరూరి గోపాల్, భిక్షమయ్య, శ్రీకాంత్‌తోపాటు 100 మంది ఆరూరి శ్రీశైలం ఆధ్వర్యంలో నార్కట్‌పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ గ్రామశాఖల అధ్యక్షుడు ఆరూరి శ్రీశై లం, ఉప సర్పంచ్ మంకాల మశ్చేందర్, నాయకులు బొంతల రామకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, నాతి శ్రీను, శ్రీను, ధనుంజయ పాల్గొన్నారు.
ఎల్ఓసీ అందజేత
నార్కట్‌పల్లి :ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిక్కుళ్ల దేవకమ్మకు మంజూరైన రూ. రూ.1.20 లక్షల ఎల్ఓసీని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చిరుమర్తి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కట్టంగూర్ : నారెగూడెం, నళ్లకుంటబోళ్లు గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య పర్యటించనున్నట్లు టీఆ ర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు గ్రామాల్లో అభివృద్ధి పనులు సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారని, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.